పాకిస్తాన్‌లోని వాయవ్య సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలు మెరుపు దాడులు నిర్వహించాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో మూడు రోజులుగా జరిపిన ఆపరేషన్లలో 21 మంది ఉగ్రవాదులు మరణించారు. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో 72 గంటలుగా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. హతమైన వారిలో నిషేధిత తెహ్రీక్- ఏ- తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ రింగ్ లీడర్లు ఉన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లలో గత వారం రోజుల్లో మొత్తం 48 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాకిస్తాన్ సైన్యం తెలిపింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలు మెరుపు దాడులు : 21 మంది మృతి
الأحد، 14 يونيو 2026
21 Killed international Military operations have been ongoing in the North Waziristan district for 72 hours Security Forces Conduct Raids in Khyber Pakhtunkhwa Province
ليست هناك تعليقات:
إرسال تعليق