ఐసీసీ ప్రకటించిన మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం జరగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ అద్భుత ప్రదర్శనలతో అగ్రస్థానానికి చేరువైనప్పటికీ శ్రీచరణి నెం.1 స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించినప్పటికీ.. శ్రీచరణి మాత్రం 14 వికెట్లతో టోర్నీలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచి తన నంబర్ వన్ ర్యాంకును కాపాడుకుంది. అయితే ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లు ఇంకా జరుగుతుండటంతో శ్రీచరణి అగ్రస్థానానికి గట్టి పోటీ ఎదురవుతోంది. తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ఓ స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకోగా.. అదే జట్టుకు చెందిన పేసర్ లారెన్ బెల్ మూడు స్థానాలు మెరుగుపరుచుకని నాలుగో ర్యాంకుకు చేరుకుంది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ నోంకుల్‌లేకో మ్లాబా ఓ స్థానం మెరుగై ఐదో స్థానంలో.. పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నష్రా సంధు ఓ స్థానం వృద్ధి చెంది 9వ స్థానంలో నిలిచారు. ఇతర బౌలర్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజానే కాప్ ఏడు స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి, స్కాట్లాండ్ కెప్టెన్ కాథరిన్ బ్రైస్ 17 స్థానాలు దూసుకెళ్లి 26వ ర్యాంకుకు, న్యూజిలాండ్ సీమర్ బ్రీ ఇల్లింగ్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 31వ స్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్ తన ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని నెలబెట్టుకుంది. భారత్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ లో అంతగా రాణించనప్పటికీ.. ఆమె అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ ఓ స్థానం మెరుగై సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకోగా.. ఐర్లాండ్ పై అజేయ సెంచరీతో అదరగొట్టిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ డాని వ్యాట్-హాడ్జ్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 11వ స్థానానికి, ఆస్ట్రేలియా వెటరన్ ఎల్లీస్ పెర్రీ 17వ స్థానానికి, దక్షిణాఫ్రికాకు చెందిన అన్నేరి డెర్క్‌సెన్ 24వ స్థానానికి చేరారు. మహిళల టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్‌కు చెందిన మెలీ కెర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఐర్లాండ్‌కు చెందిన ఓర్లా ప్రెండర్‌గాస్ట్ రెండు స్థానాలు ఎగబాకి సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. మిగిలిన వారిలో మారిజానే కాప్ ఎనిమిదో స్థానానికి, బ్రైస్ 11వ స్థానానికి ఆస్ట్రేలియాకు చెందిన అనాబెల్ సదర్లాండ్ రెండు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకున్నారు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ : అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న శ్రీచరణి
الثلاثاء، 30 يونيو 2026
claiming 14 wickets cricket ICC T20 Rankings national sports Sreecharani Retains Top Spot top ranking by emerging as one of the tournament's best bowlers
ليست هناك تعليقات:
إرسال تعليق