తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై నమోదైన కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.25 వేల వరకు ఇస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అలాగే ఓటర్లకు రూ.5 వేల చొప్పున ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు పంచుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్‌పై ఐపీసీ సెక్షన్లు 188, 171సీ, 505(2)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123(3ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బండి సంజయ్ కేసు : కొట్టివేసిన ప్రజాప్రతినిధుల కోర్టు
الثلاثاء، 30 يونيو 2026
Case Against Bandi Sanjay Regarding Huzurabad By-election Court for Public Representatives Dismisses telangana
ليست هناك تعليقات:
إرسال تعليق