మహీంద్రా XUV 7XO ఆధిపత్యానికి చెక్ :రంగంలోకి మారుతి సుజుకి, టయోటా, JSW MG మోటార్ ఇండియా

Thursday, May 7, 2026

automobile business Check on Mahindra XUV 7XO dominance JSW MG Motor India enter the fray Maruti Suzuki technology Toyota

t f B! P L


దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం 6 , 7-సీటర్ SUV విభాగంలో ప్రస్తుతం మహీంద్రా XUV 7XO తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పవర్‌ఫుల్ ఇంజన్, అదిరిపోయే ఫీచర్లు, రోడ్ ప్రెజెన్స్‌తో దూసుకుపోతున్న ఈ మోడల్‌కు పోటీగా ఇప్పుడు మార్కెట్ దిగ్గజాలు తమ వ్యూహాలను సిద్ధం చేశాయి. మారుతి సుజుకి, టయోటా, JSW MG మోటార్ ఇండియా కంపెనీలు 2026 చివరి నాటికి సరికొత్త 7-సీటర్ SUVలను లాంచ్ చేసి XUV 7XO క్రేజ్‌కు సవాల్ విసరబోతున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, ప్రస్తుతం ఉన్న తన గ్రాండ్ విటారా మోడల్‌ను మరింత విస్తరించి, ఒక పూర్తిస్థాయి మూడు వరుసల ప్రీమియం SUVని సిద్ధం చేస్తోంది. 'Y17' అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్న ఈ మోడల్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందుతున్నప్పటికీ, ఇది పొడవులో ఎక్కువగా ఉండి, లోపల మూడవ వరుస ప్రయాణికులకు కూడా మంచి స్థలాన్ని  అందిస్తుంది. ఈ కారులో మారుతి తన ప్రసిద్ధ 1.5 లీటర్ మైల్డ్ , స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లను అందించనుంది. అంతేకాకుండా, దీని డిజైన్‌లో త్వరలో రాబోయే 'eVitara' ఎలక్ట్రిక్ SUV ఛాయలు కూడా కనిపిస్తాయని సమాచారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీని , ప్రీమియం ఫీచర్లను ఆశించే కుటుంబాలకు ఇది సరైన ఎంపిక కానుంది. మారుతి 'Y17' కి అనుగుణంగానే, టొయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా తన ప్రజాదరణ పొందిన 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' మోడల్‌లో 7-సీటర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త SUVని ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా పలుమార్లు కనిపించింది. ఇందులో ముఖ్యంగా 'ఆల్‌గ్రిప్' టెక్నాలజీ ఉండబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. దీనివల్ల XUV 7XO లాగే ఇది కూడా ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ప్రస్తుత 5-సీటర్ మోడల్ కంటే దీని వెనుక భాగం కొంత పొడవుగా ఉండటమే కాకుండా, ఇంటీరియర్స్‌లో అత్యాధునిక ఫీచర్లను టయోటా జోడించనుంది. హైబ్రిడ్ టెక్నాలజీలో టొయోటాకు ఉన్న నమ్మకం , బ్రాండ్ వాల్యూ ఈ కొత్త 7-సీటర్ విజయానికి కీలకం కానున్నాయి. వీటన్నింటికీ భిన్నంగా MG మోటార్ ఇండియా 2026 దీపావళి నాటికి వినూత్నమైన సాంకేతికతతో కూడిన 'స్టార్‌లైట్ 560' SUVని లాంచ్ చేయాలని యోచిస్తోంది. వూలింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా రూపొందుతున్న ఈ మోడల్, భారతీయ వినియోగదారులకు 'ప్లగ్-ఇన్ హైబ్రిడ్' ఆప్షన్‌ను పరిచయం చేయబోతోంది. దీనివల్ల 100 కిలోమీటర్ల వరకు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ప్రయాణించే అవకాశం ఉండటం విశేషం. గ్లోబల్ మార్కెట్లో ఈ కారు సుమారు 4,745 mm పొడవుతో XUV 7XO కంటే కూడా 60 mm ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీనివల్ల ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ