Ad Code

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హైడ్రా అమలు చేయాలని ఫిర్యాదులు అందుతున్నాయి


తెలంగాణలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హైడ్రా అమలు చేయాలని ఫిర్యాదులు  అందుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాదులో 10 లక్షలకు కోట్ల విలువచేసి భూములు అన్యక్రాంతం అయ్యాయని, వీటిలో 2,100 ఎకరాల చెరువులు , పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. హైడ్రాకు ఇప్పటివరకు 30 వేల ఫిర్యాదులు వచ్చాయని పేర్నొన్నారు. ఇటీవల అమీన్‌పూర్‌లో ముఖిమ్ సంధ్య శ్రీధర్ రావు, మల్లారెడ్డికి సంబంధించిన భూములను సైతం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్ట ప్రకారమే ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, ప్రతిపక్షాలకు సంబంధించిన అక్రమ కట్టడాలను సైతం కూల్చి వేశామని వివరించారు. ప్రస్తుతం హైదరాబాదులో 25 చెరువులు స్వాధీనం చేసుకున్నామని, మరో 100 చెరువులు స్వాధీనానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో పర్యావరణం, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వాకింగ్ ట్రాక్, ఫిజికల్ యాక్టివిటీస్ పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇవన్నీ రెండు సంవత్సరాల లోపు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu