ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయీద్ ఖాన్‌ను పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెట్టుకున్నాడనే ఆరోపణలతో మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం జయీద్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న కార్యకర్తలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించినట్లు గుర్తించారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అందులో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లను గుర్తించినట్లు తెలిపారు. అలాగే అతడి వద్ద నుంచి రెండు నకిలీ పిస్టల్స్‌ను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు వెల్లడించారు.
ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు : హోటల్ కార్మికుడు అరెస్ట్
Telugu Lo Computer
0
Comments
Post a Comment