పిఠాపురం పార్టీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం

الخميس، 7 مايو 2026

Andhra Pradesh Chandrababu expressed his displeasure regarding Varma's conduct during a protocol-related controversy TDP Leadership Decides to Relieve Varma of Duties as Pithapuram Party In-charge

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం పార్టీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వర్మ పార్టీ ఇంఛార్జ్ గా ఉన్నారు. అయితే కొద్ది రోజు ల క్రితం చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదంలో వర్మ తీరు పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.  నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు రాకపోవటం పైన ఆయన మద్దతు దారులు ఆందోళనకు దిగారు. అయితే, వర్మ తాను పవన్ కు సహకరిస్తానని ప్రకటించారు. పవన్ సైతం తన గెలుపు బాధ్యతలు వర్మకే అప్పగిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొంత కాలంగా పిఠాపురంలో వర్మకు జనసేన నేతలు సరైన గౌరవం ఇవ్వటం లేదనే అభిప్రాయం ఉంది. టీడీపీ- జనసేన మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో ఫ్లెక్సీ పైన లేకపోవటంపై వర్మ నిలదీసారు. ఆ సమయంలో టీడీపీ - జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అంశం పైన సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వర్మ తీరు పైన అగ్రహంతో ఉన్న సీఎం.. ఈ వ్యవహారం పైన మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆదేశించారు. కాగా.. తాజాగా పార్టీ పోలిట్ బ్యూరో.. కమిటీల ప్రమాణ స్వీకార సమయంలోనూ పరోక్షంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొందరి ప్రవర్తనతో తాను ఆవేదన చెందనని వ్యాఖ్యా నించారు. కాగా ఆ తరువాత వర్మ తన కుమారుడుతో సహా లోకేష్ ను కలిసినట్లుగా పార్టీలో ప్రచారం ఉంది. ఇక.. ఇప్పుడు వర్మను పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, అక్కడ పార్టీ కమిటీ ఏర్పాటు చేసారు. టీడీపీ కమిటీ పిఠాపురంలో పార్టీ వ్యవహారాలను ఇక పర్యవేక్షణ చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ