ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బీరవోలు గ్రామంలో లక్ష్మిపై అనుమానంతో భర్త వెంకటస్వామి అతని సోదరులు కలిసి ఆమెను హత్య చేశారు. భార్యపై అనుమానంతో భర్త నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు ఈనెల 2 వ తేదీన భర్త వెంకటస్వామి తన భార్య లక్ష్మి అదృష్టమైందని నందివర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి విచారణ చేపట్టగా బీరవోలు గ్రామ సమీపంలో భర్త వెంకటస్వామి భార్య లక్ష్మిని గొంతు నులిమి చంపేసి ఎస్ఆర్బీసి కాలువ పక్కల పూడ్చి పెట్టామని నేరం ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించి వైద్యులతో పంచనామా చేయించారు నిందితుల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు తరలించినట్టు బనగానపల్లె రూరల్ సిఐ మంజునాథరెడ్డి మీడియాతో తెలిపారు.
ホーム
/
Nandyal district
/
అనుమానంతో భార్యను చంపిన కిరాతకుడు : అదృష్టమైందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
الخميس، 7 مايو 2026
Andhra Pradesh Banaganapalle Mandal Beeravolu village Brutal Husband Murders Wife Out of Suspicion Files Police Complaint Claiming She Went Missing Nandyal district
ليست هناك تعليقات:
إرسال تعليق