చిత్ర పరిశ్రమ క్లిష్టపరిస్థితుల్లో ఉంది : నిర్మాత దిల్ రాజు

الأربعاء، 27 مايو 2026

Andhra Pradesh cinema Dil Raju attended the teaser launch event of the film Summer Holidays Film Industry Facing Difficult Times Producer Dil Raju telangana

t f B! P L


చిత్ర పరిశ్రమ ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉందనే నిజాన్ని చెప్పడానికి తాను ఏమాత్రం భయపడనని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కిన 'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. థియేటర్ల వ్యవస్థ.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులపై ఆయన ఇండస్ట్రీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. కొత్త వాళ్లతో సినిమాలు తీస్తే ఖచ్చితంగా విజయాలు వస్తాయని తాను బలంగా నమ్ముతానని ఈ చిత్రం కూడా మంచి హిట్ సాధించాలని ఆకాంక్షించారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి దిల్ రాజు ఓపెన్‌గా మాట్లాడారు. "పరిశ్రమ ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చెప్పడానికి చాలా మంది వెనుకాడుతుంటారు.. భయపడతారు.. కానీ నేను ఈ విషయాన్ని చాలా ధైర్యంగా.. ఓపెన్‌గా చెప్పగలను.. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే" అని ఆయన పేర్కొన్నారు. ఓటీటీల కాలంలో డిజిటల్ వినోదం పెరిగిపోయిన తరుణంలో.. ఆడియన్స్‌ను థియేటర్ వైపు నడిపించడం అందరికీ ఒక పెద్ద టాస్క్ లాంటిదని అభిప్రాయపడ్డారు. 'సమ్మర్ హాలీడేస్' లాంటి వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలు తీసి ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించాలని.. అప్పుడు ఆటోమేటిక్‌గా మంచి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయని సూచించారు. చిన్న సినిమాల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్త దర్శకులు సరికొత్త ఆలోచనలతో పరిశ్రమను కాపాడాలని దిల్ రాజు పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలతోనే చాలా మంది డైరెక్టర్లు అద్భుతమైన విజయాలు అందుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. కొత్త దర్శకులందరూ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా మంచి కథలతో చిత్రాలు తీసి ఇండస్ట్రీని నిలబెట్టాలని కోరారు. చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధిస్తే.. ఇండస్ట్రీ అంత బాగుంటుందని, ఎంతో మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. పరిశ్రమ మనుగడకు చిన్న చిత్రాలే పునాది అని ఆయన నొక్కి చెప్పారు. చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఈవెంట్ ఇంత సంతోషంగా.. ఉత్సాహంగా జరగడం చూస్తున్నానని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో ఏ చిత్ర వేడుక కూడా ఇంత అద్భుతంగా జరగలేదని.. ఈ విషయంలో సినిమా నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించాలని అన్నారు. ప్రస్తుతం థియేటర్లలో కూడా ఆశించిన స్థాయిలో సందడి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విడుదల కానున్న ఈ 'సమ్మర్ హాలీడేస్' సినిమాతో థియేటర్ల వద్ద మళ్లీ పాత రోజుల్లాంటి సందడి, పండుగ వాతావరణం నెలకొనాలని దిల్ రాజు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ