ఇజ్రాయెల్ దాడిలో హమాస్ సైనికాధిపతి ఒడెహ్ మృతి

الأربعاء، 27 مايو 2026

Hamas Military Commander Odeh Killed in Israeli Strike international Israeli Defense Minister Israel Katz confirmed

t f B! P L


గాజా నగరంలోని రిమల్ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడిలో హమాస్‌ సైనికాధిపతి మొహ్మద్‌ ఒడెహ్‌ మృతి చెందారని ఇజ్రాయిల్‌ రక్షణ శాఖా మంత్రి ఇజ్రాయిల్‌ కాట్జ్‌ బుధవారం ధృవీకరించారు. 2023 అక్టోబర్‌7న ప్రారంభమై.. ఇప్పటివరకు కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటివరకు నలుగురు హమాస్‌ ఆర్మీ కమాండర్‌లు చనిపోయారు. మే 15న హత్యకు గురైన హమాస్‌ కమాండర్‌ ఇజ్ అల్ దిన్ అల్ హద్దాద్ స్థానంలో ఒడెహ్‌ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈయన బాధ్యతలు స్వీకరించిన 11 రోజులకే ఇజ్రాయిల్‌ దాడులు చేసి ఒడెహ్‌ని హతమార్చడం గమనార్హం. కాగా, పాలస్తీనా గ్రూపు సాయుధ విభాగమైన ఖస్సాం బ్రిగేడ్స్ అధిపతిగా అతని స్థానంలో హమాస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన ఒడెహ్ నియమితులయ్యారని వార్తలొస్తున్నాయి. అయితే హమాస్ ఈ నియామకాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. గాజా సిటీకి పశ్చిమాన రెమల్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.30 గంటల సయమంలో ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయని అల్‌ షిఫా ఆసుపత్రి వర్గాలు మీడియాకు వెల్లడించారు. ఈద్ పండుగ సందర్భంగా రెమల్‌ మధ్యలో రద్దీగా ఉండే ప్రాంతంలో షాపింగ్‌ చేస్తున్న ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ మూడుచోట్ల దాడులు చేసిట్లు అల్‌ జజీరా విలేకరి హింద్‌ ఖౌదరి వెల్లడించారు. ఈ దాడుల్లో భారీ విధ్వంసం జరిగిందని ఆయన తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ