రహస్య స్థావరంలోకి ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ?

الاثنين، 25 مايو 2026

Has Iran's Supreme Leader Mojtaba Khamenei Moved to a Secret Hideout? international Mojtaba is maintaining no direct contact with the outside world

t f B! P L


రాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు బయటి ప్రపంచానికి కనిపించలేదు. దీంతో అతను కూడా చనిపోయాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కూడా మోజ్తాబా బయటకు రాకపోవడంతో ఓ రహస్య ప్రాంతంలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోజ్తాబా బయటి ప్రపంచంతో డైరెక్ట్గా ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం లేదు. కేవలం తనకు నమ్మకస్థులైన వారి ద్వారా మాత్రమే అధికారులకు సందేశాలు పంపుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ప్రతిని మోజ్తాబా ఖమేనీ పరిశీలించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఇరాన్కు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, సైనిక కమాండర్లు కూడా తమ సుప్రీం లీడర్ను నేరుగా కలవలేకపోతున్నారు. ఫోన్లు లేదా డిజిటల్ నెట్వర్క్లు వాడితే ఇజ్రాయెల్ సాంకేతికతతో కనిపెడుతుందనే భయంతో కేవలం మనుషుల ద్వారానే సమాచారం చేరవేస్తున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే శాంతి చర్చలు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. ఒక్క మొజ్తాబా మాత్రమే కాదు.. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చెందిన పలువురు కీలక నేతలు కూడా కొన్ని వారాల నుంచి బంకర్లలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భారీ దాడులు ప్రారంభించాయి. ఆ దాడుల మొదటి రోజే అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మోజ్తాబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఎన్నుకున్నారు. అయితే ఇజ్రాయెల్ జరిపిన తదుపరి దాడుల్లో మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. దీనిపై ఇరాన్ ప్రభుత్వం స్పందిస్తూ ఆయన క్షేమంగానే ఉన్నారని ప్రకటించింది. అయితే తండ్రి చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోజ్తాబా ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ కు  వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ స్థానంలో ఎవరు ఉన్నా కూడా మా టార్గెట్ అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ ప్రాణభయం వల్లే మోజ్తాబా ఓ రహస్య స్థావరంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ