ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి : తెలంగాణ రక్షణ సేన

الاثنين، 25 مايو 2026

FIRs registered against Professor Nageshwar should be quashed Kavitha said arresting Professor Nageshwar is like attacking Telangana Telangana Raksha Sena

t f B! P L


ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు జేఎస్పీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని దానికి తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని తమ వద్ద సమాచారం ఉందని, అలా చేస్తే తాము ఊరుకునేది లేదని తెలంగాణ రక్షణ సేన ప్రకటించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేయడం అంటే తెలంగాణపై దాడి చేసినట్లేనని కవిత అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మేధావుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని కవిత హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా నాగేశ్వర్‌ను అరెస్టు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, టీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వాల విధానాలను శాస్త్రీయంగా, నిష్పక్షపాతంగా విశ్లేషించే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విద్యావేత్తలపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామన్నారు. రాజకీయాల్లో విమర్శలు, విశ్లేషణలు సహజం. తప్పులను ఎత్తిచూపినప్పుడు వివరణ ఇచ్చుకోవాలి తప్ప, భయభ్రాంతులకు గురిచేసి నోళ్లు మూయించాలనుకోవడం పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం అని కవిత విమర్శించారు. నిరంతరం ప్రజాస్వామ్య విలువల కోసం, సమాజ హితం కోసం మాట్లాడే వ్యక్తిపై కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే సమాజంపై దాడి చేయడమేనని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం ఎప్పుడూ మేధావులకు, ప్రజాస్వామ్య హక్కులకు అండగా ఉంటుందని గుర్తు చేసిన ఆమె, ఈ విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ