తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని న్యూట్రల్ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీ అగ్ని కీలలకు పరిశ్రమ చుట్టుపక్కల మెుత్తం దట్టమైన పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంత మంది అక్కడి నుంచి తప్పించుకోగా, మరికొంతమంది ఇంకా పరిశ్రమలోనే ఉన్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పలువురు కార్మికులు, స్థానికులు చెబుతున్నారు. అయితే, పలు రకాల రసాయనాల నిల్వలు అక్కడ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
الجمعة، 10 أبريل 2026
crime Jinnaram Mandal Major Fire Accident in Gaddapotharam Industrial Area Neutral Chemical Industry Sangareddy district telangana
ليست هناك تعليقات:
إرسال تعليق