బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. ఎర్రవల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఫామ్‌హౌస్‌లో తనను కలిసిన జీవన్‌రెడ్డికి కేసీఆర్ శాలువా కప్పి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆ దేవుడే మీతో కలిసి పని చేయమని నన్ను పంపాడంటూ కేసీఆర్‌తో అన్నారు. కాంగ్రెస్‌తో 40ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలికిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకిగా ఆవిర్భవించిన టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన జీవన్‌రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌లో కరుడుగట్టిన హస్తం వాదిగా మారిపోయారు.
కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ !
الجمعة، 10 أبريل 2026
Gangula Kamalakar Jeevan Reddy Meets KCR KCR draped a shawl over Jeevan Reddy telangana Vemula Prashanth Reddy welcomed by party leaders KTR
ليست هناك تعليقات:
إرسال تعليق