ఇరాన్‌ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చుకుంటాం : సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ హెచ్చరిక

الجمعة، 10 أبريل 2026

international Mojtaba signaled that Iran is poised to alter its strategy regarding the Strait of Hormuz Supreme Leader Mojtaba Khamenei Warns We Will Avenge Iran's Martyrs

t f B! P L


రాన్‌ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలాగని మా హక్కులను వదులుకోం. అలీ ఖమేనీతో పాటు ఇరాన్‌ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ప్రభుత్వ మీడియా ద్వారా హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకోబోతోందని మొజ్తబా ఖమేనీ సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. అలాగే తమకు జరిగిన నష్టాలకు పరిహారం కోరాలని టెహ్రాన్ భావిస్తోందని కూడా స్పష్టం చేశారు. కాగా, పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్‌ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్‌ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్‌ గల్ఫ్‌ జలాల్లో అమర్చిన సముద్ర మందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్‌ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్‌ ప్రకటించింది. చార్జ్‌ ప్రకారం చూస్తే సీమైన్స్‌ను ఇరాన్‌ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ