టీసీఎస్ లోని సీనియర్ స్థాయి ఉద్యోగులు ఉన్నపళంగా రాజీనామాలు చేస్తున్నారు. మొత్తం 1800 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో గత 8 నెలల్లోనే ఏకంగా 300 మంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. టీసీఎస్‌పై నమ్మకం తగ్గడమే ఈ ఆకస్మిక రాజీనామాలకు ఒక కారణంగా చెబుతున్నారు. వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత పదవుల్లో ఉండి, ఏళ్ల తరబడి కంపెనీతో కలిసి పనిచేసిన వారు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. గతేడాది టీసీఎస్ ఉన్నట్టుండి ఉద్యోగులను తొలగించడం, సీనియర్ ఉద్యోగుల్లో కూడా భయాన్ని, ఉద్యోగ అభద్రతను పెంచిందని 'మింట్' నివేదిక పేర్కొంది. ఎంత దీర్ఘకాలంగా పనిచేస్తున్నా, మంచి జీతం ఉన్నా... ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని వాతావరణంలో పనిచేయడం ఇష్టం లేక చాలామంది స్వయంగా తప్పుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నపళంగా వెళ్లిపోవడం కంపెనీకి, దాని క్లయింట్‌లకు మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఒకప్పుడు టీసీఎస్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే అనే భావన ఉండేది. కానీ, ఏఐ రాకతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్క మెయిల్ వస్తే చాలు, ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా కంపెనీని విడిచి వెళ్లాల్సిందే.
ホーム
/
technology
/
టీసీఎస్ లో ఉద్యోగ అభద్రత : కంపెనీని వీడుతున్న సీనియర్ స్థాయి ఉద్యోగులు : 'మింట్' నివేదిక
الثلاثاء، 7 أبريل 2026
'Mint' Report 300 have bid farewell to their jobs within just the last eight months it Job Insecurity at TCS Senior-Level Employees Exit the Company technology
ليست هناك تعليقات:
إرسال تعليق