ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేందుకు భార్య కిరాయి హంతకులకు సుఫారి ఇచ్చిన ఘటన వెలుగు చూసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి సుఫారి గ్యాంగ్ ఆట కట్టించారు. ప్రొద్దుటూరు మండంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్య వైద్యం కోసం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో పని చేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఇది వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా హతమార్చాలని భార్య ప్రియుడితో కలిసి వ్యూహ రచన చేసింది. తనకు తెలిసిన రౌడీలు ఉన్నారని, వాళ్లకు కొంత డబ్బు ఇస్తే పని ముగించేస్తారని ప్రియుడు చెప్పాడు. దీంతో మహిళ అతనికి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు డబ్బు కూడా ఇచ్చింది. దీంతో ప్రియుడు రాజుపాళెంలోని ఒక రౌడీషీటర్‌ను ఆశ్రయించాడు. లింగాపురం వ్యక్తిని హత్య చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా కొంత డబ్బు ఇచ్చి ఎలాగైనా ఆ వ్యక్తిని చంపాలని చెప్పాడు. అతని వద్ద సుఫారీ తీసుకున్న రౌడీషీటర్ ప్రొద్దుటూరులోనే పాత బస్టాండు సమీపంలో ఉన్న హిందూపురం వాళ్ల వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వాళ్లకు రౌడీషీటర్ వివరించాడు. వాళ్లకు కొంత డబ్బు ఇవ్వడంతో హిందూపురంలో ఉన్న ప్రధాన కిరాయి గ్యాంగ్‌ను ప్రొద్దుటూరుకు పిలిపించారు. లింగాపురం వాసిని చంపేందుకు హిందూపురం నుంచి సుఫారీ గ్యాంగ్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులో దిగారు. ఈ రాత్రికి లేదా గురువారం ఉదయం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం వన్‌టౌన్ పోలీసులకు తెలియడంతో అలర్ట్ అయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో హిందూపురం గ్యాంగ్, రాజుపాళెం రౌడీషీటర్‌ను, లింగాపురం గ్రామంలోని భార్యభర్తలు, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేందుకు భార్య యత్నం : కుట్రను భగ్నం చేసిన ప్రొద్దుటూరు పోలీసులు
الخميس، 23 أبريل 2026
Andhra Pradesh crime Kadapa district Proddatur Police Foil Plot Wife Attempts to Murder Husband for Standing in the Way of Extramarital Affair
ليست هناك تعليقات:
إرسال تعليق