దక్షిణ కొరియాలో డేజియాన్‌లో ఉన్న ఓ-వరల్డ్ జూ నుంచి తప్పించుకున్న తోడేలును తొమ్మిది రోజుల తర్వాత బంధించారు. రెండేళ్ల ఆ తోడేలు జూ నుంచి తప్పించుకోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అయితే దాన్ని తిరిగి బంధించిన తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. జూ నుంచి తోడేలు కనిపించకుండాపోవడంతో, దాని భద్రతపై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. జూ బయట ఆ తోడేలు బ్రతుకుతుందా అని జనం ఆందోళనపట్టారు. జంతు ప్రేమికులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఓ దశలో న్యుకుగు తోడేలు గురించి దేశాధ్యక్షుడు లీ జేయి ముంగ్ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రకటన చేశారు. తోడేలును పట్టుకునేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మిలిటరీ ప్రయత్నం చేశాయి. డ్రోన్లతో తీవ్ర గాలింపు చేపట్టారు. తోడేలు మళ్లీ చిక్కడంతో సోషల్‌మీడియాలో అభిమానులు సంబరాల పోస్టులను చేశారు. న్యూకుగు సురక్షితంగా తిరిగివచ్చిందని, దీనిపై తన ఫేస్‌బుక్ పేజీలో డేజియాన్ మేయర్ లీ జాంగ్ వూ ఓ కథనాన్ని రాశారు. 2008లో రష్యా నుంచి దక్షిణకొరియా తోడేళ్లను తీసుకువచ్చింది. వాటికి చెందిన మూడో సంతానం ఇది.
తొమ్మిది రోజుల తర్వాత చిక్కిన తోడేలు
السبت، 18 أبريل 2026
celebrations erupted across the country following its successful recapture international O-World Zoo in Daejeon South Korea Wolf Captured After Nine Days
ليست هناك تعليقات:
إرسال تعليق