రాజ్యాంగ సూత్రాలపై జరుగుతున్న దాడిని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇది నిజమైన మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, దేశంలోని రాజకీయ, ఎన్నికల వ్యవస్థను మార్చే ప్రయత్నమని ఆయన ఆరోపించారు. నిజంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే 2023లో ఆమోదించిన పాత మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూటిగా సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ బిల్లును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువల విజయమని వ్యాఖ్యానించారు. చివరగా లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో రాజ్యాంగ సవరణకు కావాల్సిన మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
చిత్తశుద్ధి ఉంటే 2023 మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలి !
السبت، 18 أبريل 2026
If There Is Sincerity Implement the 2023 Women's Bill Immediately Lok Sabha Leader of the Opposition Rahul Gandhi national
ليست هناك تعليقات:
إرسال تعليق