ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సుమారు 3,700 మంది సిబ్బందికి గరిష్టంగా రూ. 1 కోటి వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న 'కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ' ఒప్పందం ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ బీమా సౌకర్యం కోసం అటు ఉద్యోగి గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి జీతం ఆధారంగా రూ. 40 లక్షల నుండి రూ. 1 కోటి వరకు బీమా వర్తిస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రాష్ట్రంలోని 11,760 మంది ఉపాది హామీ సిబ్బంది జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.78కోట్లు విడుదల చేసింది. అటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కూలీల వేతన బకాయిలను చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 31 వరకు పెండింగ్‌లో ఉన్న రూ. 383 కోట్ల బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ నగదు నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. దాదాపు 20 ఏళ్లుగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను 'ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయీస్'లుగా గుర్తించాలని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రాజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్యకు వినతిపత్రం సమర్పించారు.
ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా
الخميس، 23 أبريل 2026
Free Personal Accident Insurance for Staff Working Under the Employment Guarantee Scheme national up to a maximum of ₹1 crore
ليست هناك تعليقات:
إرسال تعليق