శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో రవితేజ నటించిన మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎమోషనల్ అండ్ మాస్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డును చూసి ట్రేడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద రవన్న ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 250 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లు సాధించి రవితేజ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని హిస్టారిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కేవలం ఒక కమర్షియల్ సినిమాగా మాత్రమే కాకుండా.. తరతరాలను కదిలించిన కథగా, ప్రేక్షకులందరినీ భావోద్వేగంతో ఒక్కతాటిపైకి తెచ్చిన ‘జనరేషనల్ బ్లాక్ బస్టర్’గా ఈ సినిమా రికార్డులకెక్కింది. థియేటర్లలో స్క్రీన్ కు ఆవల కూడా ఒక గొప్ప సెలబ్రేషన్ లా నిలిచిన ‘ఇరుముడి’, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని చెప్పాలి. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ‘ఇరుముడి’.. ఇండియా వైడ్‌గా ఏకంగా నంబర్ వన్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడుతున్నారు.
రూ.250 కోట్ల క్లబ్‌లో ‘ఇరుముడి’ !
الاثنين، 21 سبتمبر 2026
'Irumudi' Enters the ₹250 Crore Club cinema directed by Shiva Nirvana OTT platforms produced on a grand scale by Mythri Movie Makers recently released poster
ليست هناك تعليقات:
إرسال تعليق