కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చీర కట్టుకోకుండా నైటీ ధరిస్తోందనే చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన ఓ భర్త, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన వెలుగుచూసింది వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజీ పాటిల్ (29), మంజులా పాటిల్ (27) దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కృష్ణాజీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మంజుల ఇంట్లో నైటీలు ధరించడం కృష్ణాజీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడూ చీరలే కట్టుకోవాలని ఆమెతో తరచూ గొడవ పడేవాడు. భర్త మాటను కాదని మంజుల నైటీ ధరించడంతో నిన్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భార్య తన మాట వినడం లేదన్న కోపంతో కృష్ణాజీ, భార్య మంజులపై ఏకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె హాహాకారాలు విన్న స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మంజుల 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడైన కృష్ణాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
చీర కట్టుకోకుండా నైటీ ధరిస్తోందన్న కోపంతో కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
الخميس، 23 أبريل 2026
Belagavi district crime Husband Sets Wife on Fire in a Fit of Rage for Wearing a Nightie Instead of a Saree karnataka
ليست هناك تعليقات:
إرسال تعليق