బీహార్ ముఖ్యమంత్రిగా ఏప్రిల్ 15న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన, ఆ పార్టీ తరపున బీహార్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న తొలి నేతగా రికార్డు సృష్టించనున్నారు. ఇన్నాళ్లు సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బీజేపీ, ఇప్పుడు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడపబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి పేరును ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరిచారు. కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నిర్ణయాన్ని అధికారిక ప్రకటించారు. బీహార్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్, మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నేను బీహార్ ప్రజల కోసం ఎంతో పని చేశాను. ఇటీవల ముఖ్యమంత్రి పదవిని వదలాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించాను అని నితీశ్‌ కుమార్ చెప్పారు.

Post a Comment

Previous Post Next Post