ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరంలో అగరబత్తీల తయారీ పేరుతో జరిగిన ఒక భారీ ఆర్థిక మోసం కలకలం రేపుతోంది. అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ అనే వ్యక్తి సత్యసాయి ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఒక నకిలీ పథకాన్ని సృష్టించి సుమారు 3 వేల మంది అమాయక మహిళలను బురిడీ కొట్టించాడు. ఇంటి వద్దే ఉంటూ అగరబత్తీలు మరియు పేపర్ ప్లేట్లు తయారు చేస్తే లక్షల్లో సంపాదించుకోవచ్చని నమ్మించి వారి నుండి భారీగా డిపాజిట్లు వసూలు చేశాడు. కేవలం అగరబత్తీలే కాకుండా ఇతర గృహోపకరణాల తయారీ మిషన్లు ఇప్పిస్తామని నమ్మబలికి ఈ మోసానికి తెరలేపాడు. చివరకు పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ రాజమండ్రి త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసానికి ప్రధానంగా మహిళలనే లక్ష్యంగా చేసుకున్న నిర్వాహకులు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకున్నారు. ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్ వసూలు చేసి, ప్రతి నెలా రూ. 12,500 ఆదాయం వస్తుందని గాలం వేశారు. సంధ్యారాణి అనే మహిళ ద్వారా యూట్యూబ్ లో భారీగా ప్రచారం చేయించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని మహిళలు అప్పులు చేసి మరీ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. తణుకు, రావులపాలెం మరియు భీమవరం వంటి ప్రాంతాల్లో ప్రత్యేక మేనేజర్లను నియమించి నెట్ వర్క్ మార్కెటింగ్ తరహాలో ఈ దందాను సాగించారు. గత నాలుగు నెలల నుండి రావాల్సిన నగదు నిలిచిపోవడంతో అసలు విషయం బయటపడింది. సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన మహిళలు రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మోహన్ కృష్ణ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు రూ. 25 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్న పోలీసులు, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
అగరబత్తీల పేరుతో రూ. 25 కోట్ల కుచ్చుటోపీ : ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్ వసూలు
الأربعاء، 8 أبريل 2026
₹25 Crore Fraud Under the Guise of Incense Stick Manufacturing Andhra Pradesh crime Deposits of Up to ₹1 Lakh Collected from Each Victim
ليست هناك تعليقات:
إرسال تعليق