2038 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ అధికారికంగా తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ ప్రతిపాదనలు సమర్పించింది. ఏప్రిల్ 21న చైనాలోని సాన్యా నగరంలో ఇటీవల జరిగిన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా సమావేశంలో భారత్ పంపిన ఈ ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని ఐఓఏ సీఈఓ రఘురామ్ అయ్యర్ ధృవీకరించారు. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు. 2038 ఆసియా క్రీడల రేసులో అహ్మదాబాద్ నగరం ముందు వరుసగా నిలిచింది. ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం అహ్మదాబాద్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆసియా క్రీడలు కూడా అక్కడే నిర్వహించే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల కోసం భారత్‌తో పాటు దక్షిణ కొరియా, మంగోలియా లాంటి దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. 2038లో ఈ క్రీడలు ఎక్కడ జరుగుతాయనేది 2028 సంవత్సరంలో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది.
2038 ఆసియా గేమ్స్‌కు బిడ్ వేసిన భారత ఒలింపిక్ అసోసియేషన్
الجمعة، 24 أبريل 2026
Indian Olympic Association Bids for 2038 Asian Games international national South Korea and Mongolia have also expressed interest in hosting this prestigious sporting event sports
ليست هناك تعليقات:
إرسال تعليق