అమెరికాను ఎదిరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వైమానిక దళం జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ మీడియా ప్రకటించింది. దీంతో ఇరాన్‌కు గట్టి దెబ్బ తగిలినట్టయింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఆయన మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఇరాన్ ఈ మేరకు ధ్రువీకరించింది. ఇజ్రాయెల్, అమెరికా పక్కా సమాచారంతోనే ఖమేనీని చంపినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భారీ దాడులు జరిపినట్లు అమెరికా అధికారవర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఖమేనీ మృతికి సంబంధించి తమ దేశ సీనియర్ అధికారులకు స్పష్టమైన సమాచారం అందిదని ఇరాన్ ప్రకటనకు ముందు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆయన మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్రంప్, నెతన్యాహు చూశారని వెల్లడించింది. అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబంలోని పలువురు మృతి చెందారు. ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఖమేనీ కోడలు కూడా మరణించినట్లు సమాచారం. ఖమేనీ మరణంతో ఇరాన్ పాలనా పగ్గాలు ఇపుడు ఓ కౌన్సిల్ చేతికి చేరాయి. ఈ కౌన్సిల్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారని, ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. ఈ కౌన్సిల్‌లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఒక జ్యూరీ సభ్యుడు ఉంటారు. ఈ కౌన్సిల్ తాత్కాలికంగా మాత్రమే ఇరాన్ పాలనా బాధ్యతలను చూడనుంది. ఇరాన్‌లో సుప్రీం లీడర్ తర్వాత శక్తిమంతమైన విభాగాల్లో ఇది కూడా ఒకటి. దీనిలో 88 మంది సభ్యులు ఉంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అధికారం ఈ గ్రూపునకు ఉంది. ఈ ప్యానల్‌లో ఎనిమిదేళ్ల పదవీకాలం కోసం ఎంపికై వచ్చిన షియా మతగురువులు ఉంటారు. ఈ విభాగమే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా చూస్తుంది.
అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి : కౌన్సిల్ చేతిలోకి ఇరాన్ పాలన
الأحد، 1 مارس 2026
international Iran's Supreme Leader Khamenei dies in US strikes Iranian media confirmed this Iranian rule in the hands of the council
ليست هناك تعليقات:
إرسال تعليق