ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.వికారాబాద్‌లో జరిగే డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 9:20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఉదయం 10:20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వికారాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ చేరుకుని, అక్కడి హరిత హోటల్‌లో జరిగే శిక్షణ తరగతులకు హాజరవుతారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా డీసీసీ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5:00 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు. రాహుల్ గాంధీ పర్యటనలో కేవలం శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. రాహుల్ గాంధీ పర్యటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారు. ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో రేపు రాహుల్ గాంధీ పర్యటన
الأحد، 1 مارس 2026
attend the training classes of DCC presidents to be held in Vikarabad he will meet former Maoist leaders Rahul Gandhi to visit Telangana tomorrow
ليست هناك تعليقات:
إرسال تعليق