యుద్ధం కారణంగా ముడిచమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు తమ ఉద్యోగులను తిరిగి 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాల్సిందిగా ఆదేశించాయి. వియత్నాంలో గ్యాసోలిన్ ధరలు 32 శాతం, డీజిల్ ధరలు 56 శాతం పెరగడంతో రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇంటి నుంచే పని చేయడం ఒక్కటే మార్గమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. థాయ్‌లాండ్‌లో సైతం కేవలం 95 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉండటంతో, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రయాణాలు తగ్గించి విద్యుత్ ఆదా చేయాలని ప్రధాని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు భారత ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరులపై కూడా పడుతోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారతదేశానికి రావాల్సిన ఎల్‌పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన దేశ అవసరాల్లో దాదాపు 67 శాతం దిగుమతులపైనే ఆధారపడటం, అందులోనూ సింహభాగం హార్ముజ్ జలసంధి ద్వారానే రావాల్సి ఉండటంతో ప్రస్తుతం సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మళ్లీ ఇంటి నుండే పని చేసే అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వెల్స్ ఫార్గో వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కట్టాకం వంటి కార్పొరేట్ దిగ్గజాలు లింక్డ్‌ఇన్ వేదికగా చేసిన సూచనలు ఇప్పుడు ఐటీ కారిడార్లలో హాట్ టాపిక్‌గా మారాయి. వేలాది మంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి వాడే ఇంధనాన్ని ఆదా చేసి, దానిని అత్యవసర సేవలకు మళ్లించడం ప్రస్తుతం ఒక సామాజిక బాధ్యతగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, ఇంధన కొరత కారణంగా దేశీయ వాణిజ్య రంగం విలవిలలాడుతోంది. గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగి, ముంబైలో 20 శాతం హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. బెంగళూరు, చెన్నైలలోని రెస్టారెంట్లు తమ పని వేళలను కుదించుకుంటున్నాయి. విమాన ఇంధనం ధరలు పెరగడం వల్ల విమాన టిక్కెట్ల ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధనాన్ని తెప్పించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఇంధన డిమాండ్‌ను తగ్గించాలంటే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడమే సరైన మార్గమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ホーム
/
War Impact
/
యుద్ధ ప్రభావం : 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల మొగ్గు
الأربعاء، 11 مارس 2026
government international IT giants opt for 'Work from Home' national Vietnam and Thailand War Impact
ليست هناك تعليقات:
إرسال تعليق