వాయుసేనలో పాక్ గూఢచారి అరెస్టు

الاثنين، 23 مارس 2026

Air Force surveillance units joint operation conducted by Rajasthan Intelligence massive espionage network was exposed during a swift national Pakistani Spy Arrested in Air Force

t f B! P L


రాజస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ నిఘా వర్గాలు జరిపిన మెరుపు దాడిలో ఈ భారీ గూఢచారి నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. ఈ ఆపరేషన్ ఒక చిన్న అనుమానంతో మొదలైంది. ఈ ఏడాది జనవరిలో జైసల్మేర్‌కు చెందిన ఝబారా రామ్ అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పాక్ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్న ఒక 'పెద్ద చేప' గురించి రామ్ సమాచారం ఇచ్చాడు. ఆ క్లూ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అస్సాంలోని చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సుమిత్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సుమిత్ కుమార్, 2023 నుంచే పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపినట్లు తేలింది. కేవలం కొన్ని వేల రూపాయల ఆశ చూపి పాక్ హ్యాండ్లర్లు ఇతడిని బుట్టలో వేసుకున్నారు. తన ఉద్యోగ హోదాను అడ్డం పెట్టుకుని, వాయుసేనలోని అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియా ద్వారా సరిహద్దులు దాటించాడు. యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల మోహరింపు వివరాలు. చబువా, బికనీర్ (నల్) వంటి కీలక ఎయిర్ బేస్‌ల మ్యాపులు. కీలక అధికారులు, సిబ్బంది వ్యక్తిగత వివరాలు. వీటన్నింటినీ సుమిత్ దొంగచాటుగా పాకిస్థాన్‌కు చేరవేశాడు. అంతటితో ఆగకుండా, తన పేరు మీద ఉన్న మొబైల్ నంబర్లతో పాక్ గూఢచారులు సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించుకోవడానికి కూడా సహకరించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు. సుమిత్ కుమార్ కదలికలపై పక్కా ఆధారాలు సేకరించిన రాజస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ బృందాలు అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లా చబువాలో సంయుక్త దాడి నిర్వహించాయి. అతడిని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైపూర్‌కు తరలించారు. మార్చి 22న 1923 నాటి 'అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్' (అధికార రహస్యాల చట్టం), 2023 బీఎన్‌ఎస్ చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ