అటానమస్ మారిటైం షిప్ యార్డుకు భూమిపూజ చేసిన మంత్రి నారా లోకేష్

الخميس، 12 مارس 2026

Andhra Pradesh Juvvaladinne Minister Nara Lokesh laid the foundation stone for the Autonomous Maritime Shipyard Nellore district Sagar Defense Company

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న అటానమస్ మారిటైం షిప్ యార్డుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డు కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక నౌకల నిర్మాణం ఇక్కడ జరగనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో సుమారు రూ.45 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 750 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మానవరహిత నౌకలు , అత్యాధునిక సాంకేతికతతో కూడిన యుద్ధ నౌకల తయారీకి ఈ కేంద్రం చిరునామాగా మారబోతోంది. శంకుస్థాపన సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీని కేవలం ఐటీ రంగంలోనే కాకుండా తయారీ, రక్షణ రంగాల్లో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రపంచ స్థాయి నౌకల తయారీని ఇక్కడి నుంచే ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జువ్వలదిన్నె పోర్ట్ ఆధారంగా ఈ ప్రాంతం రానున్న రోజుల్లో భారీ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ