ఫోన్‌పే ద్వారా లంచం తీసుకున్న ట్రెజరరీ సీనియర్‌ అసిస్టెంట్‌ ను అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

الخميس، 12 مارس 2026

ACB officials arrested a senior assistant of the treasury who took bribe through PhonePe taking bribe for salary bills due to a government employee telangana Yadadri Bhuvanagiri

t f B! P L


తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎండీ ఖదీర్ ప్రభుత్వ ఉద్యోగికి రావలసిన వేతన బిల్లుల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఖదీర్ విడతల వారీగా ఫోన్‌ పే ద్వారా రూ. 15 వేలు లంచం తీసుకోవడంపై బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖదీర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం మోత్కూర్‌లోని ఎస్‌టీవో కార్యాలయంపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. 38 రోజులకు సంబంధించిన వేతనం రూ. 1,09,384 కోసం బాధితుడు అధికారులను సంప్రదించగా తొలి విడతగా ఖదీర్‌ స్నేహితుడు సీనియర్‌ అసిస్టెంట్‌ నిరంజన్‌ అకౌంట్‌లోకి రూ.5 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు. చివరి రెండు విడతలు ఖదీర్‌కు ఫోన్‌ పే ద్వారా చెల్లించాడు. ఏసీబీ అధికారులు ఎస్‌టీవో సీనియర్‌ అసిస్టెంట్‌ ఖదీర్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ