దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టాయి. త్వరలోనే యుద్ధం ముగింపునకు వస్తుందంటూ ట్రంప్ ఇచ్చిన హింట్ మార్కెట్లకు ధైర్యాన్ని నింపింది. ఉదయం 10.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 437 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ సూచీ 130 పాయింట్లు ఎగబాకింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 696 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 533 పాయింట్ల పెరుగుదలను నమోదు చేశాయి. నేడు ఇంట్రాడేలో ఆటో, ఫార్మా రంగాల షేర్లు ప్రధానంగా లాభాలతో దూసుకుపోతుండగా.. ఐటీ స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడితో చిత్తయ్యాయి. ప్రపంచం మెుత్తం క్రూడ్ ఆయిల్, గ్యాస్ షార్టేజీతో అంధకారంలోకి వెళ్లిపోతోంది. ఈ క్రమంలో ఇరాన్ హర్ముజ్ జలసంధి వద్ద ఆయిల్ సరఫరాకు ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తే ఇప్పుడు చేసిన దాడుల కంటే 20 రెట్లు శక్తివంతమైన దాడులు జరుపుతామని ఇరాన్ దేశాన్ని హెచ్చరించారు ట్రంప్. అయితే మరోపక్క హర్ముజ్ జలసంధి తర్వాత ఎర్రసముద్రం గల్ఫ్ ఆఫ్ అడాన్‌ని కలిపే బాబ్ ఎల్ మన్డెబ్ వద్ద కూడా ఇలాంటి అడ్డంకులే క్రూడ్ సరఫరాకు ఎదురవుతాయా అనే భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో కూడా ఆందోళనలు తగ్గి సౌత్ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రావటంతో ఆ సానుకూల పవనాలు దేశీయ ఇన్వెస్టర్లను కూడా ముందుకు నడిపిస్తున్నాయి. అలాగే గతరాత్రి అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో క్లోజ్ కావటం దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను మెరుగుపరిచింది.
నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
الثلاثاء، 10 مارس 2026
business national Stock markets recover from losses and return to profit Trump's hint that the war will end soon has given courage to the markets
ليست هناك تعليقات:
إرسال تعليق