మార్చి 17న పోకో ఎక్స్ 8 సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల

الثلاثاء، 10 مارس 2026

Poco X8 series to launch two phones on March 17 released as Flipkart exclusive phones science technology X8 Pro and X8 Pro Max

t f B! P L


దేశీయ మార్కెట్లో మార్చి 17న పోకో ఎక్స్ 8 సిరీస్ లో రెండు ఫోన్లను విడుదల చేయన్నునట్లు పోకో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ల డిజైన్, వివరాలు వెల్లడించే టీజర్ పోస్టులు కూడా కంపెనీ తన అఫీషియల్ X అకౌంట్ నుంచి షేర్ చేసింది. ఈ ఫోన్లు కూడా ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన ఫోన్లుగా విడుదల చేయబోతున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.  పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ నుంచి ఎక్స్ 8 ప్రో, ఎక్స్ 8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది. వీటిలో ఎక్స్ 8 ప్రో మంచి కాంపాక్ట్ డిజైన్ తో మరియు ఎక్స్ 8 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ పెద్ద సైజులో ఉంటుంది. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతల గురించి కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లలో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో పవర్ పవర్ ఫుల్ కెమెరాలు ఉంటాయని మాత్రమే కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ గురించి వచ్చిన కొన్ని లీక్స్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు వెల్లడించాయి. లీక్స్ ప్రకారం, ఈ సిరీస్ ప్రీమియం ఫోన్ ఎక్స్ 8 ప్రో మాక్స్ మీడియాటెక్ Dimensity 9500s లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎక్స్ 8 ప్రో ఫోన్ ను మాత్రం Dimensity 8500 Ultra చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా కెమెరా పై ప్రత్యేకమైన LED లైట్ మరియు డ్యూయల్ ఫ్లాష్ సెటప్ కలిగి ఉంటుందని కూడా లీక్స్ చెబుతున్నాయి. మాక్స్ ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్ కలిగి ఉంటే, ఎక్స్ 8 ప్రో మోడల్ మాత్రం 6.59 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్ల డిస్ప్లే లు కూడా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు కూడా బిగ్ బ్యాటరీ సెటప్ కూడా కలిగి ఉంటాయని చెబుతున్నారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ