హైదరాబాద్ లోని శామీర్‌పేట సమీపంలో కారు ఆపి భోజనం చేస్తున్న వారిపై ఓ కంటైనర్ వేగంగా దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం, నగరంలోని మౌలాలి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆడి కారులో ప్రయాణిస్తున్నారు. శామీర్‌పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్‌పై వారు కారును ఆపి పక్కనే నిలబడి భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన కంటైనర్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శామీర్‌పేట పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి పంచనామా నిర్వహించారు.
భోజనం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కంటైనర్ : ఇద్దరు దుర్మరణం
الاثنين، 16 مارس 2026
Container Plows into People Having Lunch crime hyderabad near Shamirpet residents of the Moula Ali area in the city telangana Two Die Tragically
ليست هناك تعليقات:
إرسال تعليق