ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన "అనిమేష" కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ. లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేస్తారు. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మెదక్ జిల్లా బందారం గ్రామంలో సిధారెడ్డి 1955లో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, 'ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు' అనే అంశంపై ఎం.ఫిల్ (1981) పట్టా ఆ తర్వాత 'ఆధునిక కవిత్వం, వాస్తవికత - అధివాస్తవికత' పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు.
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
الاثنين، 16 مارس 2026
2026 for his poetry collection titled Animesha Central Sahitya Akademi Award for Nandini Sidhareddy national served as the first Chairman of the Telangana Sahitya Akademi telangana
ليست هناك تعليقات:
إرسال تعليق