టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ గోపాల్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు

الأربعاء، 11 مارس 2026

Extension of tenure of TAFRC Chairman Justice Gopal Reddy relaxing the rules to allow him to continue in the post until further orders telangana

t f B! P L


తెలంగాణ అడ్మిషన్స్‌, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్డి జస్టిస్‌ ఏ.గోపాల్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగేలా నిబంధనలకు సడలింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది. కాగా రాష్ట్రంలోని ప్రైవేట్ అన్‌-ఎయిడెడ్ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా ఖరారు చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2027-28 వరకు వర్తించే ఈ కొత్త ఫీజులపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా జీవో నెం.06తో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తాజాగా నిర్ణయించి ఫీజులు 2025-26 నుంచి 2027-28 విద్యా సంవత్సరానికి వర్తించనున్నాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ సమర్పించిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ ఫీజులను నిర్ణయించింది. ఖరారు చేసిన ట్యూషన్ ఫీజులో అడ్మిషన్ ఫీజు, ఇతర ప్రత్యేక ఫీజులు కలవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ