అమెరికాలో 300 బిలియన్ డాలర్లతో కొత్త ఆయిల్ రిఫైనరీని నిర్మించేందుకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గత ఐదు దశాబ్దాలుగా అమెరికాలో ఒక్క కొత్త రిఫైనరీ కూడా ఏర్పాటు కాలేదు. ఇప్పుడు రిలయన్స్ భాగస్వామ్యంతో టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో 'అమెరికా ఫస్ట్ రిఫైనింగ్' సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టబోతోంది. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ స్పందిస్తూ "అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందం. 50 ఏళ్ల తర్వాత దేశంలో మొదటి కొత్త ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కాబోతోంది. ఈ అద్భుతమైన పెట్టుబడి పెడుతున్నందుకు మా భారతీయ భాగస్వాములకు, ముఖ్యంగా రిలయన్స్ సంస్థకు నా కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. టెక్సాస్ తీరంలోని బ్రౌన్స్‌విల్లే ఓడరేవులో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇది అమెరికా మార్కెట్లకు ఇంధనాన్ని అందించడమే కాకుండా, అక్కడి నుండి ముడి చమురు ఎగుమతులకు కూడా కీలకం కానుంది. పర్యావరణానికి హాని కలగకుండా, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా ఇది పనిచేస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల దక్షిణ టెక్సాస్ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వెనుకబడిన ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థను ఈ పెట్టుబడి పూర్తిగా మార్చేస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ రిఫైనరీలు ఏర్పాటు చేయాలని చూసినా అధిక ఖర్చుల కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు రిలయన్స్ ముందుకు రావడంతో ఈ మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ప్రస్తుతానికి రిలయన్స్ వర్గాల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో ఈ భారీ డీల్ ఖాయమైనట్లు తెలుస్తోంది. జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నడుపుతున్న రిలయన్స్, ఇప్పుడు అమెరికాలో కూడా తన ముద్ర వేయబోతుండటం విశేషం.
అమెరికాలో 300 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ : 'ట్రూత్ సోషల్'లో ప్రకటించిన ట్రంప్
الأربعاء، 11 مارس 2026
'America First Refining' is going to take up this project in Brownsville business international national Reliance Oil Refinery in America with 300 billion dollars Texas Trump announced on 'Truth Social'
ليست هناك تعليقات:
إرسال تعليق