అమెరికాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) విస్తరిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ తీర ప్రాంతాలలో వల్ల అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో , శాక్రిమెంటో మరికొన్ని నగరాలలో జనవరి నెలలో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అక్కడి నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ వల్ల శ్వాసకోస వ్యాధులు వస్తాయని దీనికి టీకా లేదని తెలియజేస్తున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి కేవలం లక్షణాలను తగ్గించే విధంగా చికిత్స అందిస్తారని తెలుస్తోంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు మందులు తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని, శ్వాస ఇబ్బందులు ఉంటే ఆక్సిజన్ థెరపీ వంటివి ఉపయోగించాలని తెలిపారు. ఈ వైరస్ కొత్తది కాదని 2001లోనే కనుగొనబడినట్లు తెలియజేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఎక్కువగా అమెరికాలో హెచ్ఎంపీవీ కేసులు నమోదు అవుతున్నాయని 2026 ఫిబ్రవరి 1 నాటికి కేసులు భారీగా పెరిగిపోయాయని 3.83 శాతం నుంచి 7.43 శాతానికి పెరిగాయని తెలుపుతున్నారు. న్యూజెర్సీ వంటి ప్రాంతాలలో కోవిడ్, ఫ్లూ, హెచ్ఎంపీవీ, ఆర్ఎస్వీ వంటి కేసులు పెరగడంతో అక్కడ ఎమర్జెన్సీ వైద్య సేవలు కోరుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, జ్వరం ,శ్వాస ఆడకపోవడం వంటివి ఈ వ్యాధుల లక్షణాలని అధికారులు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు ఈ లక్షణాల వల్ల న్యుమోనియాకు కూడా దారి తీయవచ్చని తెలియజేస్తున్నారు. ఈ వైరస్ ఎక్కువగా శీతాకాలం నుంచి వసంతకాలం వరకు వ్యాపిస్తుందని. ఈ వైరస్ కాల వ్యవధి మూడు నుంచి ఆరు రోజులపాటు ఉంటుందని ఎక్కువగా చిన్నపిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అధిక ప్రభావం చూపిస్తోందని అధికారులు తెలియజేస్తున్నారు.
అమెరికాలో విస్తరిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్
Monday, March 9, 2026
arogyam health Human Metapneumonia Virus Spreading in America international people are facing difficulties due to it in the West Coast areas science
No comments:
Post a Comment