Ad Code

ఏడు నిమిషాల్లో 999 యూనిట్లు బుక్ అయిన మహీంద్రా బీఈ 6 బాట్మన్ !


హీంద్రా అండ్ మహీంద్రా ప్రత్యేక ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ మహీంద్రా బీఈ 6 బాట్మన్ ను మళ్లీ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది  7 నిమిషాల్లో 999 యూనిట్లు బుక్ కావడం విశేషం. ఇంతకుముందు 2025 ఆగస్టు 14న విడుదల చేసిన మొదటి బ్యాచ్ కూడా కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా సేల్ అయింది. దీంతో ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీపై వినియోగదారుల్లో ఉన్న ఆసక్తి మరోసారి రుజువైంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.28.49 లక్షలుగా నిర్ణయించారు. ఇది BE 6 Pack Three 79kWh వేరియంట్‌పై ఆధారపడి రూపొందించబడింది. మొదటి బ్యాచ్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త ఎడిషన్ ధర సుమారు రూ.70,000 ఎక్కువగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV డెలివరీలు 2026 ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. Batman థీమ్‌తో వచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్ SUVలో ప్రత్యేకమైన డిజైన్ కనిపిస్తుంది. ఇది సాటిన్ బ్లాక్ పెయింట్ ఫినిష్ తో అందుబాటులో ఉంది. అలాగే ఫ్రంట్ ఫెండర్, వీల్ హబ్‌క్యాప్‌లు, రియర్ బంపర్‌పై బ్యాట్ లోగో కనిపిస్తుంది. డ్యుయల్ 12.3 ఇంచ్ HD స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), హార్మన్ కార్డన్ 16 స్పీకర్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ మెమరీ ఫంక్షన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, అదనంగా 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.  79kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ ప్రకారం ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 683 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ SUVలో 282 BHP పవర్, 380 Nm టార్క్ ఇచ్చే రియర్ వీల్ డ్రైవ్ మోటార్ ఉంది. 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో చేరుతుంది. అదనంగా 175kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20 నుంచి 80 శాతం వరకు కేవలం 20 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu