కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐసీసీ టీ20 మొదటి సెమీ ఫైనల్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించి, 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ ఫిన్ అలెన్. కేవలం 33 బంతుల్లోనే అజేయ సెంచరీ (100*) సాధించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ఇన్నింగ్స్‌లో సిక్సర్లు, ఫోర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మ్యాచ్ అనంతరం ఫిన్ అలెన్ మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించడానికి భారత్‌తో ఆడిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా భారత్‌లోని నల్ల రేగడి పిచ్‌లపై ఆడిన అనుభవం.. ఈడెన్ గార్డెన్స్‌లోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తనకు ఎంతో సహాయపడిందని వివరించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్న అలెన్ తన కాబోయే హోమ్ గ్రౌండ్‌లో ఈ స్థాయి ప్రదర్శన చేయడం విశేషం.
ఐసీసీ టీ20 : ఫైనల్‌కి చేరిన న్యూజిలాండ్
الخميس، 5 مارس 2026
cricket ICC T20 Kiwis chased down the target of 170 runs set by South Africa in just 12.5 overs and won by 9 wickets New Zealand reaches final sports
ليست هناك تعليقات:
إرسال تعليق