అమెజాన్ రోబోటిక్స్ డివిజన్ లో ఉద్యోగాల కోత : బిజినెస్ ఇన్‌సైడర్

الخميس، 5 مارس 2026

Amazon Robotics Division Job Cuts business Business Insider internal email by Scott Dresser technology Vice President of Robotics Division

t f B! P L


మెజాన్ రోబోటిక్స్ డివిజన్ లో ఉద్యోగాల కోత ఉందని బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది. తాజా తొలగింపులను రోబోటిక్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ డ్రెస్సర్ ఓ ఇంటర్నల్ మెయిల్ చేసినట్లు పేర్కొంది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నిర్ణయం కష్టమైనదే అయినప్పటికీ సంస్థకు అవసరమ ఆయన పేర్కొన్నట్లు వివరించింది. సంస్థలోని కొన్ని డివిజన్లను పునర్వ్యవస్థీకరిస్తున్నప్పటికీ రోబోటిక్స్ విభాగంలో చేపట్టిన తాజా చర్యలు వ్యూహాత్మకమని డ్రెస్సర్ స్పష్టం చేశారు. ఎంతమంది ఉద్యోగులు దీనివల్ల ప్రభావితం అయ్యారనేది బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించలేదు. తాజా పునర్వ్యవస్థీకరణలో భాగంగా తక్కువ సంఖ్యలో రోబోటిక్స్ డివిజన్ లో ఉద్యోగాల కోత పెట్టినట్లు అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలియజేసినట్లు బిజినెస్ ఇన్‌సైడర్‌ పేర్కొంది. లేఆఫ్స్ ఉన్నప్పటికీ కూడా వ్యూహాత్మక రంగాలు, డివిజన్లల్లో పోటీని ఎదుర్కొనే క్రమంలో సమయానుకూలంగా కొత్త నియామకాలు ఉంటాయని, రోబోటిక్స్ విభాగంలో సైతం భారీగా పెట్టుబడులు కొనసాగిస్తామని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. 100 ఉద్యోగాలను తొలగించినట్లు పీపుల్ మ్యాటర్స్ తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు వేతన రాయితీ, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, ఇతర సంస్థల్లో ఉద్యోగాల కల్పన కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని అమెజాన్ పేర్కొంది. రోబోటిక్స్ విభాగంలో ఈ మార్పులు జరుగుతున్న సమయంలో అమెజాన్ ఇటీవల "బ్లూ జే" వేర్‌హౌస్ రోబో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని కొన్ని నెలల వరకే పరిమితం చేసింది. కొత్త రోబోటిక్స్ సిస్టమ్‌కు మారడంలో భాగంగా దీన్ని పరిమితం చేసినట్లు వివరించింది. ఆటోమేషన్ అమెజాన్ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. ప్రస్తుతం వేలాది రోబోలు వాటి ఫుల్ఫిల్‌మెంట్ నెట్‌వర్క్‌లో వస్తువులను తరలించడానికి, క్రమబద్ధీకరించడానికి ఉపయోగిస్తున్నాయి. తాజా తొలగింపులు గత కొన్ని సంవత్సరాలలో కంపెనీలో జరిగిన అనేక ఉద్యోగ కోతలకు అదనం. 2022 నుండి అమెజాన్ సుమారు 57,000 ఉద్యోగాలను తొలగించింది. ఇందులో గత ఏడాది అక్టోబర్‌, ఈ ఏడాది జనవరిలో సంభవించిన లేఆఫ్స్ వాటా అధికం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ