ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైడ్ బిజినెస్‌గా చోరీలు కూడా చేసేవాడు. విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న మహేష్ ముసుగు దొంగగా పోలీసులలో పేరుపడ్డాడు. కరడుగట్టిన దొంగ అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ చోరీ చేసిన సొత్తుతో బిఎండబ్ల్యూ కారు కొని షికార్లు కొట్టేవాడు. ఇలా విశాఖపట్నంలోనే మహేష్ రెడ్డి పై ఏకంగా 26 చోరీ కేసులు ఉన్నాయి. 15 ఏళ్ల వయసులోనే నాలుగు చోరీలు చేసిన మహేష్ హోమ్ నుంచి విడుదలయ్యాక చోరీలు చేయడంలో ఆరితేరి పోయాడు. కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, ఇంద్రాల పాలెం, రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో సుమారు 32 దొంగతనాల కేసులు ఉన్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 నెలల శిక్ష అనుభవించిన మహేశ్వర్ రెడ్డి అవకాశం ఉన్నప్పుడు దొంగతనాలు చేసి హైదరాబాద్ లో విలాసవంతంగా జీవనం సాగించేవాడు. తాజాగా ఈ సాఫ్ట్‌వేర్ దొంగని పోలీసులు అరెస్ట్ చేసి 699 గ్రాముల బంగారం, 3.805 కిలోల వెండి, బీఎండబ్ల్యూ కారు, ఓ స్కూటీ, నేరానికి వినియోగించిన ఐరన్ రాడ్, టోపీ మాస్క్ సీజ్ చేసి జైలుకు తరలించారు.
విలాసాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు
السبت، 7 فبراير 2026
3.805 kilograms of silver a BMW car a scooter Addicted to Luxuries Andhra Pradesh Arrested for Thefts crime Mahesh Reddy alias Sunny seized 699 grams of gold Software Engineer telangana
ليست هناك تعليقات:
إرسال تعليق