నేపాల్ చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు సునీల్ తాపా (68) శనివారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన్ని ఖట్మండులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 1981లో తన నట ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్ తాపా, సుమారు 45 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు సేవలందించారు. కేవలం నటుడిగానే కాకుండా, నేపాల్‌లో ఒక ఫిల్మ్ స్కూల్‌ను స్థాపించి ఎంతోమంది నూతన నటీనటులను ప్రోత్సహించారు. నేపాలీ, భోజ్‌పురి భాషలతో పాటు బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'మిరాయ్'లో ఆయన కీలక పాత్ర పోషించారు. నేపాల్‌లో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 'మేరీ కోమ్' బయోపిక్‌లో ఆమెకు కోచ్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన 'పత్తు ఎన్నత్తుకుల్లా' చిత్రంలోనూ ఆయన నటించారు.
ప్రముఖ నటుడు సునీల్ తాపా కన్నుమూత
السبت، 7 فبراير 2026
cinema mark on both the Nepalese and Indian film industries served the film industry for approximately 45 years Veteran actor Sunil Thapa passes away
ليست هناك تعليقات:
إرسال تعليق