ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. లాలా చెరువు సమీపంలోని చౌడీశ్వరి నగర్ ప్రాంతంలో ఈనెల 15వ తేదీ తర్వాత నుంచి వాంతులతో, మూత్ర విసర్జన కాకపోవడంతో, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో దాదాపు 14 మంది ఆసుపత్రులలో చేరారు. ఇది స్థానికంగా తీవ్ర కల్లోలం రేపింది. ఆస్పత్రి పాలైన ప్రతి ఒక్కరికి ఒకే వ్యక్తి పాలు సరఫరా చేయడం, పాలలో కల్తీ జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కల్తీ పర కారణంగానే ఈ విధంగా జరిగి ఉండొచ్చని వారు వైద్యాధికారులు, పోలీసులకు బాధితులు తెలిపారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనలో 76సంవత్సరాల భాగిశెట్టి కనక రత్నం, 75సంవత్సరాల తాడి కృష్ణవేణి మృతిచెందగా, తాజాగా 72 సంవత్సరాల ఎన్ శేషగిరిరావు 74 ఏళ్ల రాధాకృష్ణమూర్తి మృతి చెందారు. బాధితులలో ఎక్కువమంది 60 సంవత్సరాలకు పైబడిన వారే కాగా, ఒక ఐదు నెలల శిశువు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు ఒకేసారి అస్వస్థతకు గురికావడంతో ఆదివారం నాడు ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి వీరికి ఈ పాలను అందిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అతను విక్రయించే పాలను ల్యాబ్ కు పంపించడంతో పాటు బాధితుల రక్త మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షలకు పంపించారు.
ホーム
/
Two more died
/
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కలకలం ? : మరో ఇద్దరు మృతి, మరో నలుగురి పరిస్థితి చాలా విషమం
الاثنين، 23 فبراير 2026
14 people have been admitted to hospitals in Chaudhishwari Nagar Adulterated milk in Rajamahendravaram? Andhra Pradesh condition of four others is critical Two more died
ليست هناك تعليقات:
إرسال تعليق