తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం కేసు దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో కమిషన్ తన విచారణను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. గతంలో సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని, ఇది విచారణను ప్రభావితం చేస్తుందని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ విచారణ ప్రక్రియలో 'ఓవర్‌లాపింగ్' (అతిక్రమణ) కిందికి రాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తును ఈ కమిషన్ ప్రభావితం చేస్తుందని భావించడం లేదని ధర్మాసనం పేర్కొంది. వాస్తవాలను వెలికితీసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను తేల్చే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
తిరుమల లడ్డూ కేసు : ఏకసభ్య కమిషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
الاثنين، 23 فبراير 2026
Andhra Pradesh Former MP Subramanian Swamy had filed Supreme Court dismisses petition challenging single-member commission Tirumala Laddu Case
ليست هناك تعليقات:
إرسال تعليق