వాట్సాప్ కొన్ని ప్రత్యేక ఫీచర్ల కోసం పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురానున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పు వల్ల సాధారణ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. డబ్బులు చెల్లించకపోయినా వాట్సాప్ ఉచిత వెర్షన్ యథావిధిగా కొనసాగుతుంది. అయితే, అదనపు సౌకర్యాలు కావాలనుకునే వారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ప్రొఫెషనల్ మరియు పవర్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్త ఫీచర్లతో పాటు వాట్సాప్ భద్రతపై కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెసేజ్‌లు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ అని కంపెనీ చెబుతున్నా, అమెరికాలో కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపణలు చేయడంతో విచారణలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో, ఈ పెయిడ్ ప్లాన్ కోసం వెయిట్ లిస్ట్ సిస్టంను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫీచర్లు అందుబాటులోకి రాగానే ముందుగా తెలుసుకోవాలనుకునే వారు ఇందులో నమోదు చేసుకోవచ్చు. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలను మెటా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Post a Comment