తమిళనాడులోని కడలూరు జిల్లాలో కోడలి అక్రమ సంబంధానికి మామ అడ్డుగా ఉండడంతో అతడిని నడిరోడ్డులో తగలబెట్టిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పన్రుటి ప్రాంతంలో రాజేంద్రన్ అనే అనే రైతు తన కుమారుడికి జయప్రియ అనే యువతితో పెళ్లి చేశాడు. కొన్ని రోజుల క్రితం కుమారుడు చనిపోవడంతో జయప్రియ మరో వ్యక్తి మణికందన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కోడలు వివాహేతర సంబంధం మామకు తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మణికందన్ ను కూడా ప్రియురాలి మామ మందలించాడు. దీంతో జనవరి 29న తన స్నేహితుడితో కలిసి రాజేంద్రన్ బైక్ పై వెళ్తుండగా మణికందన్ తన అనుచురులతో కలిసి వారిని అడ్డుకున్నారు. రాజేంద్రన్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ ప్రాణభయంతో రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా జనవరి 31 చికిత్స పొందుతూ రాజేంద్రన్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు మణికందన్ తో పాటు కోడలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
0 Comments