హైదరాబాద్, పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నటి కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కళ్యాణి గతంలో అన్వేష్‌పై కంప్లైట్ ఇవ్వగా పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే ఇటీవల అన్వేష్ అకౌంట్‍ను ఇన్ స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. తర్వాత తనకు రెండు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు రెండు, యూట్యూబ్ చానల్స్ ఉన్నాయని అన్వేష్ వీడియోను విడుదల చేశారు. ఆ సందర్భంలో అతడు అసభ్యకరమైన పదజాలాన్ని వాడాడు. ఈ విషయంలోనూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‍కు కూడా పంజాగుట్ట పోలీసులు లేఖ రాయబోతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామంతో నా అన్వేష్ అరెస్ట్ కావడం ఖాయమా అనే చర్చ జరుగుతోంది. అన్వేష్ కు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కరాటే కల్యాణీ ఇంతటితో ఆగబోమని రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దేవీ దేవతలను దూషించడంతో పాటు భారతదేశ పాస్ పోర్టును, దేశ రాజముద్రను అవహేళన చేసేలా మాట్లాడి రాజద్రోహం చేశాడని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. విర్రవీగడం, మిడిసి పోవడం మనిషికి పనిచేయదన్నారు.
యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు
الأربعاء، 25 فبراير 2026
Andhra Pradesh Kalyani had earlier filed a complaint against Anvesh Punjagutta Police issues lookout notices on YouTuber Anvesh telangana
ليست هناك تعليقات:
إرسال تعليق