ఆంధ్రప్రదేశ్ లో 2018లో గ్రూప్ 1 అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ చేస్తుంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలంటూ గత విచారణలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. దీంతో ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇవాళ సీఎస్ విజయానంద్ ను హైకోర్టుకు పిలిపించి వివరణ తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి 2018 గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ శాఖల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల్ని వెంటనే అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందులో సదరు గ్రూప్ 1 అధికారుల్ని అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తున్నట్లు ఇవాళ సాయంత్రం 7 గంటల్లోకా తనకు నివేదిక పంపాలని ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు పంపారు. 2018 గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొందరు అభ్యర్ధులు హైకోర్టుని ఆశ్రయించారు. అప్పటి నుంచీ దీనిపై విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అప్పటి జవాబు పత్రాల్ని భద్రపరచడంతో పాటు మూల్యాంకనంలో చోటు చేసుకున్న లోపాలపై సిట్ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్ ను నియమించి దర్యాప్తు చేయిస్తోంది. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకూ అప్పట్లో నియామకాలు పొందిన వారిని కీలక పోస్టుల్లో నుంచి అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని సీఎస్ ను హైకోర్టు ఇవాళ పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
2018లో గ్రూప్ 1 అక్రమాలు కేసు : హైకోర్టు ఆదేశాలతో అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
الأربعاء، 25 فبراير 2026
Andhra Pradesh CS Vijayanand to the High Court today and sought an explanation Government takes decision to transfer to non-essential posts on High Court orders Group 1 irregularities case in 2018
ليست هناك تعليقات:
إرسال تعليق