హైదరాబాద్ నగరంలో యువకులు బైక్‌పై చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సీపీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలని సూచించారు. బైక్ మీద చేసే ఈ చిత్రవిచిత్రమైన విన్యాసాలు చూడటానికి థ్రిల్లింగ్‌గా అనిపించవచ్చని, కానీ అవి క్షణాల్లో ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడతాయని ఆయన హెచ్చరించారు. బైక్ మీద చేసే విన్యాసం - నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం అంటూ ఆయన పేర్కొన్నారు. చిన్న ప్రమాదం జరిగినా జీవితాంతం మంచానపడాల్సి వస్తుందని సీపీ అన్నారు. అంతేకాకుండా, మీ వల్ల ఇతరులు కూడా ప్రమాదాలబారిన పడొచ్చని తెలిపారు. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం.. రోడ్డు మీద హీరోయిజం చూపించాలనే ఆశతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సజ్జనార్ సూచించారు. బైక్ స్టంట్లు చేస్తూ వెనుక కూర్చున్న వ్యక్తుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతున్న ఈ చర్యలు చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి వాటి వల్ల కేసుల పాలై సమస్యలను కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. 'బాధ్యతగా డ్రైవ్ చేయండి' అంటూ సీపీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బైక్ మీద చేసే విన్యాసం - నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం : యువతకు సీపీ సజ్జనార్ హెచ్చరిక
الثلاثاء، 10 فبراير 2026
' CP Sajjanar posted on X 'Drive responsibly Bike stunts - ruining a hundred-year life CP Sajjanar warns youth hyderabad telangana
ليست هناك تعليقات:
إرسال تعليق